ట్రాజిడీ కింగ్ దిలీప్ కుమార్ పేరెందుకు మార్చుకున్నారు? అసలు పేరేంటి?

ముంబై : బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. ఆయన పుట్టింది పాకిస్థాన్‌లోని పెషావర్‌లో. 1922 డిసెంబర్ 11న ఆయన జన్మించారు. యూసుఫ్ ఖాన్ ప్రొఫెషనల్ పేరు దిలీప్ కుమార్. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే యాక్టర్లు.. పేర్లు మార్చుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే దిలీప్ కుమార్ కూడా తన పేరును మార్చుకున్నారు. కానీ ఆ మార్పు వెనుక ఓ ఆశ్చర్యకరమైన కారణం ఉన్నది. మొదటి సినిమా జ్వర్ భాటా లో నటించేందుకు ఆయనకు ఛాన్స్ దక్కింది. అయితే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న దేవికా రాణి.. యూసుఫ్ ఖాన్‌ను పేరు మార్చుకోవాలని సూచించింది. నిజానికి అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో హిందువులదే పైచేయి. దాంతో దిలీప్ పేరును పెట్టుకునేందుకు యూసుఫ్ ఖాన్ అంగీకరించాడు. అంతేకాదు, తన తండ్రికి సినిమాల్లో నటించడం ఇష్టంలేదు. దాని వల్ల కూడా ఆయన పేరు మార్పుకు అంగీకరించాడు.
దేవికా రాణి తనకు స్క్రీన్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పిందని, ఆ పేరుతో నిన్ను అందరూ పిలుస్తారని, రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పేరును పెట్టనున్నట్లు దేవిక చెప్పినట్లు దిలీప్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. దిలీప్ కుమార్ పేరు పెట్టాలన్న ఆలోచన తనకు వచ్చిందని, ఇది బాగుంటుందని, నీకెలా అనిపిస్తుందని దేవిక తనను అడిగినట్లు దిలీప్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే వేలల్లో జీతం వస్తుందన్న ఉద్దేశంతోనే తాను సినిమా కెరీర్‌ను ఎంపిక చేసుకున్నట్లు దిలీప్ ఓసారి తెలిపారు.
మధుమతి, దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ లాంటి మేటి చిత్రాల్లో దిలీప్ ప్రధాన పాత్రలు పోషించారు. అందాజ్, బాబుల్, దీదర్, జోగన్ లాంటి ప్రేమ విషాద చిత్రాల్లోనూ ఆయన నటించారు. ఆ సినిమాల్లో నటించిన తర్వాత ఆయనకు ట్రాజిడీ కింగ్ అన్న పేరు వచ్చింది. 1998లో రిలీజైన ఖిలా ఆయన నటించిన చివరి సినిమా. 1994లో దాదాసాహెబ్ ఫాల్క్, 1991లో పద్మభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

