త్రివిక్రమ్ ఒక్కో యాడ్ కోసం ఎంత తీసుకుంటాడో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కూడా ఒకడు. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడతారు. మరోవైపు త్రివిక్రమ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఇక్కడా అక్కడా చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈయన మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎండోర్స్ మెంట్ కూడా తెరకెక్కిస్తున్నారు. అందులో త్రివిక్రమ్ తో పాటు క్రిష్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు ఉన్నారు. అయితే మహేష్ బాబు లాంటి హీరోలు మాత్రం ఎక్కువగా తాము చేసే యాడ్స్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని దర్శకుడిగా ఎంచుకుంటారు.
ఎందుకంటే బ్రాండింగ్ ఎవరు చేయాలో కార్పొరేట్ కంపెనీ నిర్ణయిస్తుంది. కానీ ఆ బ్రాండింగ్ చేసే యాడ్ ఎవరు తెరకెక్కించాలనేది మాత్రం పూర్తిగా హీరో నిర్ణయం. వాళ్లు ఎవరు కోరుకుంటే వాళ్ల దగ్గరికి కంపెనీలు నడుచుకుంటూ వస్తాయి. మన తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ యాడ్స్ తెరకెక్కించాలంటే త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. ఈ యాడ్ తియ్యాలంటే దర్శకులకు మహా అయితే ఒక రోజు పడుతుంది. పైగా యాడ్ కు సంబంధించిన స్క్రిప్ట్, ఐడియా రెండు కంపెనీ ఇస్తుంది. కేవలం గ్రాండ్‌గా తమ బ్రాండ్ ప్రమోట్ చేయడమే వాళ్లకు కావాలి.
అయితే ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కాదని సందీప్ రెడ్డి వంగాతో ఒక ఏసీ యాడ్ చేశాడు మహేష్ బాబు. ఇందులో తమన్నా నటించింది. ఈ యాడ్ చేసినందుకు ఈయనకు అటు విడిగా కేవలం 5 లక్షలు మాత్రమే పారితోషికంగా అందిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ మాత్రం ఒక్కో యాడ్ కోసం 30 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజు పని చేస్తే అన్ని లక్షలు రావడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో మాటల మాంత్రికుడు అందరికంటే ముందున్నాడు. ఈయన చేసే యాడ్స్ కూడా అంతే సరదాగా ఉంటాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలకు కూడా త్రివిక్రమ్ అంటే అంత మోజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

