Neha Shetty | డీజే టిల్లు సినిమాలో రాధికా పాత్రతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింది నేహా శెట్టి. ఈ సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న నేహాశెట్టి చివరగా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటించింది. కాగా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ను పక్కన పెట్టేసి సరదాగా షికారు చేసే పనిలో పడింది టిల్లు భామ. సముద్ర తీరంలో విహరిస్తూ బీచ్ అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతుంది.
ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌటు. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం మాల్దీవులకు వెళ్లింది నేహాశెట్టి. బీచ్‌లో బికినీలో ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసింది. ఇప్పుడీ స్టిల్స్, వీడియోలు నెట్టింట రౌండప్ చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరే సినిమాకు సైన్ చేయలేదు.
సాగరతీరంలో ఇలా..
#Nehashetty 🤍🔥..#nehashettyhot #sundayvibes #Sundayspecial pic.twitter.com/mGOUnH3i6h
— 𝕾𝖔𝖚𝖙𝖍𝖎𝖓𝖉𝖎𝖆𝖓𝖍𝖊𝖗𝖔𝖎𝖓𝖊𝖘_𝖜𝖔𝖗𝖑𝖉® (@Southqueens1) August 10, 2025
Mega Actors | ఒకే చోట మెగా హీరోలు.. వైరలవుతున్న ఫొటో
Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ షురూ అయ్యేది అప్పుడేనట..!