Divi Vadthya | బిగ్‌బాస్ షోతో సూపర్ క్రేజ్ సంపాదించిన అతికొద్ది మంది భామల్లో టాప్‌లో ఉంటుంది దివి వైద్య (Divi Vadthya). సిల్వర్ స్క్రీన్ అయినా, సోషల్ మీడియా అయినా కండ్లతో మాయ చేస్తూ.. కనువిందు చేస్తుంటుంది. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ నెట్టింట చాలా చురుకుగా ఉంటుందని తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది.
ఈ బ్యూటీ తాజాగా.. మెరిసే తారలదే రూపం.. విరిసే పూవులదే రూపం.. మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఈ రూపం..నా కన్నులు చూడని రూపం. గుడిలో దేవత ప్రతిరూపం.. నీ రూపం అపురూపం.. అంటూ సిరివెన్నెల రాసిన పాటను మరోసారి గుర్తుకు తెస్తోంది. ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోతూ నెట్టింట సెగలు పుట్టించే దివి తాజాగా యూ టర్న్ తీసుకుంది. ఈ సారి పల్లెదనం ఉట్టి పడేలా విలేజ్ గాళ్‌గా మారిపోయింది.
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా.. అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ..నీ రాకకై ఎదురుచూస్తూ..నే నీకోసం చేస్తున్న నిరీక్షణ.. అంటూ దివి పోస్ట్ చేసిన ఫొటోలు.. దివి నుంచి భువికి తారక దిగొచ్చిందా అన్నట్టుగా కనిపిస్తూ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. 2019లో మహర్షి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరిసిన దివి.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో కీలక పాత్రలో మెరిసింది.
విలేజ్ గాళ్ అవతార్‌లో దివి సోయగాలు..
తెలుపు రంగు చీరలో దివి అందాలు..