ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు ఎందుకు.. డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం

థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా అనుమతులు జారీ చేసిన కూడా ఇప్పటి వరకు తెలంగాణలో ఓపెన్ కాలేదు. 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయొచ్చు అని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. ఇలాంటి సమయంలోనే నిర్మాతలకు మరో షాక్ ఇచ్చారు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు. డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు, సినీ ప్రముఖులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. థియేటర్లను తెరిచే అంశంపై చర్చలు జరిపారు. అయితే అందుకు డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అన్నారు. ఓటీటీల వల్ల ఈ రోజుల్లో థియేటర్లు తీవ్ర నష్టాలను చవి చూస్తాయని… వాటి నుంచి థియేటర్లను రక్షించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారు.
ఒక సినిమా తెరకెక్కించిన తర్వాత దాన్ని థియేటర్లలో విడుదల చేయడం పద్ధతి అని.. అలా కాదని ఓటీటీల్లో విడుదల చేస్తే థియేటర్లను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ నిర్ణయంతో నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ నిర్ణయంతో నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లు తెరవడానికి డిస్ట్రిబ్యూటర్లు నో చెప్పడంతో అసలు సమస్యలు ఇప్పుడే మొదలయ్యాయి.
ఈ సమావేశంలో చాలా విషయాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కొత్త సినిమాలను ఓటీటీలకు ఇవ్వడం ఆపాలని నిర్మాతలను కోరుతూనే.. మరో పక్క కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు లాంటి డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. వీటన్నింటి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అన్నింటిపై ఒక నిర్ణయం వచ్చిన తర్వాత కానీ థియేటర్లు తెరవకూడదు అని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. అన్ని సానుకూలంగా అనిపిస్తే జూలై 23న థియేటర్లను పున ప్రారంభించేందుకు ఎగ్జిబిటర్లు ఫిక్సైనట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- distributors
- ott
- producers
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

