బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సిరీస్ హైలైట్స్‌ను హీరో అభిజీత్ వివరించారు. ‘మిస్ పర్ఫెక్ట్లో నాది హీరో క్యారెక్టర్. పాత్ర పేరు రోహిత్. చాలా బద్ధకస్తుడిగా కనిపిస్తా. రియల్ లైఫ్‌లో రోహిత్‌లాంటి క్యారెక్టర్స్‌ను చాలా చూశాను. నా ఫ్రెండ్సూ ఉన్నారు. ఇష్టంగా ఉద్యోగం చేయలేక.. బిజినెస్‌తో రిస్క్ చేయలేక సంఘర్షణలో ఉండిపోతారు. వయసు 40 దాటితే అసలే రిస్క్ చేయలేరు. రొమాంటిక్ కామెడీ సిరీస్ ఇది’ అని తెలిపారు.