ఒకవైపు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూనే.. సింగర్‌గా మారిన స్టార్ డైరెక్టర్ కూతురు..
Director Shankar's daughter aditi as a singer | సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు సింగర్‌గా అవతారమెత్తింది.
Director Shankar’s daughter aditi as a singer | సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు సింగర్‌గా అవతారమెత్తింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం గని. ఈ చిత్రంలోని రోమియో..జూలియెట్ అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ను అదితి ఆలపించింది. ఈ సాంగ్ ప్రొమో సోమవారం విడుదలైంది. తాజాగా గని టీం సాంగ్ లాంఛ్ ఈవెంట్లో ఈ పాటను విడుదలచేశారు. రఘురాం సాహిత్యం అందించిన ఈ బాణీని తమన్ స్వర పరిచాడు.
శంకర్ కూతురు అదితి తండ్రిలాగే సినిమా ఇండస్ట్రీలో రాణించాలని అనుకుంటుంది. అందుకే ఎంబీబీఎస్ చదివినా కూడా సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. కార్తి హీరోగా వస్తున్న విరుమన్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేయబోతుంది. నటిగా ఇంకా పరిచయం కాకముందే.. ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టింది అదితి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలో రోమియో జూలియెట్ పాటను పాడింది. ఇది అదితి పాడిన ఫస్ట్ సాంగ్ కావడం విశేషం. అదితి ఈ సాంగ్ పాడటానికి ముఖ్య కారణం తమన్. బాయ్స్ సినిమా నుంచే శంకర్‌తో తమన్‌కు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే #RC16 సినిమా కోసం తమన్‌కు శంకర్ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా సమయంలో అదితిని దగ్గర నుంచి చూసిన తమన్ ఆమెలోని టాలెంట్‌ను గుర్తించాడు. ఆమె వాయిస్ నచ్చడంతో గని సినిమాలో ఒక పాటించాడని సమాచారం. తన హీరోలతో పాటలు పాడించడం తమన్‌కు ముందు నుంచే అలవాటు ఉంది. ఇప్పటికే రవితేజ, ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలో కొన్ని లైన్లు పాడించాడు. తాజాగా శంకర్ కూతురు అదితితో పాట పాడించాడు.
తాను పాడిన పాట గురించి అదితి తన ట్విట్టర్లో.. ‘నా సింగింగ్ డెబ్యూ మీ అందరికి షేర్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నా మరో కల నెరవేరనుంది. తమన్ సర్ కి చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి ఈ అవకాశం నాకు ఇచ్చారు. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. రఘురాం సాహిత్యం అందించిన ఈ బాణీని తమన్ స్వర పరిచాడు.అల్లుఅరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్దూ ముద్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.వరుణ్ తేజ్ సరసన సాయిమంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది.
MY SINGING DEBUT✨🎙🎼
Waited so long to share this with you all. Another dream come true. @MusicThaman sir Thank you so much for trusting me and giving me this opportunity. Hope you guys like it♥️🧿🤞#ghani #romeojuliet #singingdebut pic.twitter.com/JOboB9VaMM— Aditi Shankar (@AditiShankarofl) February 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

