కుటుంబ బంధాలు, ఉమ్మడి కుటుంబంలోని అనురాగాలు, అన్నదమ్ముల ఆత్మీయతలను కథావస్తువుగా చేసుకుని సినిమాలు తెరకెక్కించడంలో ప్రతిభావంతుడు దర్శకుడు శ్రీవాస్. ఇంతకుముందు గోపీచంద్‌తో లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన సినిమాలను రూపొందించిన శ్రీవాస్ తాజాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీవాస్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
రామబాణం ప్రచార చిత్రాలు చూస్తుంటే ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు ైస్టెలిష్ మాస్ యాక్షన్ సినిమాలా అనిపిస్తుంది?
గోపీచంద్ సరిపోయే యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరిన సినిమా ఇది. అన్నదమ్ముల అనుబంధం మీద ఒక కొత్త పాయింట్‌తో అన్ని బావోద్వేగాలను మిళితం చేసిన కథ ఇది.
ఈ చిత్రానికి లక్ష్యం-2 అనే టైటిల్‌ను అనుకున్నారని తెలిసింది?
మొదట్లో అనుకున్నాం. కానీ ‘లక్ష్యం’ సినిమా వచ్చి చాలా సంవత్సరాలైంది. అందుకే కొత్త టైటిల్ పెడదామని అనుకుని ‘రామబాణం’ టైటిల్ పెట్టాం.
ఆర్గానిక్ ఫుడ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు?
ఆర్గానిక్ ఫుడ్ పాయింట్‌ని కథకు ఎంత అవసరమో అంతే వాడాం. ఏ కథ చేయాలన్నా కాన్ఫ్లిక్ట్ కావాలి. కాన్ఫ్లిక్ట్ గురించి ఆలోచించినప్పుడు కరోనా తరువాత జనాల్లో ఫుడ్‌పై జాగ్రత్త పెరిగింది. దానికి సంబంధించిన అంశం పెడితే కనెక్టింగ్‌గా వుంటుందనిపించింది. అందుకే ఆర్గానిక్ ఫుడ్ నేపథ్యాన్ని పెట్టాం.
ఇప్పుడున్న ట్రెండ్‌లో రామబాణం లాంటి సాఫ్ట్ కథతో సినిమా చేయడం రిస్క్ అనిపించిందా?
హారర్, డార్క్, రగ్గడ్ సినిమాలు విడుదలై విజయం సాధిస్తే అందరూ అవే సినిమాలు చూస్తారని అనుకుంటాం. కానీ నా అనుభవం ప్రకారం కుటుంబం అంతా కలిసి వెళ్లి చూడడానికి ఒక మంచి సినిమా కావాలి. అందరూ కూర్చుని హ్యాపీగా చూసే సినిమా అవసరం. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా రావడం లేదనే వెలితి ఎప్పుడూ వుంటుంది. ఆ వెలితిని ‘రామబాణం’ భర్తీ చేస్తుంది.
మీరు వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు సేఫ్ జోన్‌గా భావిస్తున్నారా?
ఫ్యామిలీ ఎమోషన్స్ కథలతో సినిమాలు తీయడం తేలిక కాదు. అది సేఫ్ జోనర్ కూడా కాదు. హారర్, థ్రిల్లర్స్ యాక్షన్, కొరియన్ ఇంగ్లీష్ చిత్రాలు చూసి ప్రేరణ పొందే అవకాశం వుంది. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అలా కాదు. కథ, పాత్రలు జీవితం నుంచి రావాలి. మనం నిత్యం చూసే పాత్రల్లోనే కొత్తదనం చూపించడం అంత తేలిక కాదు. నేను ఇలాంటి తరహా సినిమాలు చేయడానికి కారణం నేను వచ్చిన నేపథ్యం కావచ్చు. అలాగే ఇలాంటి చిత్రాలతోనే నాకు ప్రేక్షకుల ఆదరణ లభించింది. అయితే దర్శకుడిగా అన్ని రకాల చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను.
పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచనలు వున్నాయా?
మనం చేసే సినిమా పాన్ ఇండియాకు వెళ్ళాలి కానీ పాన్ ఇండియా సినిమా అనుకుని చేస్తే కుదరదని నా అభిప్రాయం.
గోపీచంద్‌తో మూడో సారి కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
గతంలో ఆయనతో రెండు సినిమాలకు కలిసి పనిచేయడం వల్ల ఆయన బాడీ లాంగ్వేజ్‌పై ముందే ఒక అవగాహన వుంది. ఆయనకు ఎలాంటి సన్నివేశాలు నప్పుతాయనేది స్క్రిప్ట్ లెవల్లోనే ఫిల్టర్ అయిపోతాయి. తరువాత వర్క్ చేయడం చాలా తేలికగా వుంటుంది.