Ram Gopal Varma | టీచర్స్ డే రోజున వర్మ వివాదాస్పద ట్వీట్.. గురువుల జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరు.!
Ram Gopal Varma Teachers Day | ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్‌తో వివాదాస్పదంగా మారాడు. శుక్రవారం(సెప్టెంబర్ 05)న టీచర్స్ డే సందర్భంగా వర్మ తన గురువులకు విషెస్ తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు.
Ram Gopal Varma | ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్‌తో వివాదాస్పదంగా మారాడు. శుక్రవారం(సెప్టెంబర్ 05)న టీచర్స్ డే సందర్భంగా వర్మ తన గురువులకు విషెస్ తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్బర్గ్, అయాన్ రాండ్తో పాటు భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పేరును కూడా చేర్చారు.
వర్మ తన పోస్ట్‌లో రాసుకోస్తూ.. నేను దర్శకుడిగా మారడానికి లైఫ్‌లో నేను నచ్చింది చేయడానికి నన్ను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే ఒక బిగ్ సెల్యూట్. నాకు ప్రేరణగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీంలకి టీచర్స్ డే శుభాకాంక్షలు అంటూ వర్మ రాసుకోచ్చాడు. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు వర్మని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. తన జీవితంలో తనకు మార్గనిర్దేశం చేసిన గురువుల జాబితాను ప్రకటిస్తూ.. అందులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పేరును చేర్చడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక ఉగ్రవాదిని గురువుగా పేర్కొనడం సరైంది కాదని మండిపడుతున్నారు.
Here’s a BIG SALUTE to all the GREATS who inspired me to become whatever I became and to make whatever films I made, starting from AMITABH BACHCHAN, STEVEN SPIELBERG , AYN RAND ,BRUCE LEE, SRIDEVI and DAWOOD IBRAHIM 🙏🙏🙏 HAPPY TEACERS DAY 💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

