R Narayanamurthy | ఆంధ్రప్రదేశ్లో చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతి ఇవ్వడంపై దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, అలీ, ఆర్ నారాయణమూర్తి, దర్శకులు కొరటాల శివ, రాజమౌళి, నిర్మాత నిరంజన్ రెడ్డి సమావేశమై సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు.
ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. సగటు సినిమా మనుగడ కష్టతరమైంది. భారీ సినిమాలు విడుదలైనప్పుడు అన్ని సమయాల్లో ఆడేవి. సగటు సినిమా బతుకు ఐసీయూలోని పేషెంట్ మాదిరిగా ఉంది. చిన్న సినిమాలను బతికించేందుకు చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని, చిరంజీవి గొప్ప పాత్ర పోషించారు. సినీ పరిశ్రమ సమస్యలపై అటు సీఎం కేసీఆర్, ఇటు సీఎం జగన్ మంచి చొరవ చూపారు. నంది అవార్డులు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని నారాయణమూర్తి పేర్కొన్నారు.