TVK Vijay | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ఆయన స్వయంగా కలిసి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్‌తో దిగిన ఫొటోను షేర్ చేసిన లోకేష్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ అన్నా నీకు శుభాకాంక్షలు అంటూ లోకేష్ రాసుకోచ్చాడు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’, ‘లియో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం దర్శకుడిగానే కాకుండా విజయ్‌తో లోకేష్‌కు ఎంతో కాలంగా మంచి ఆత్మీయ అనుబంధం ఉంది.