శివ కంఠమనేని, సంజన గల్రానీ, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మణిశంకర్’. లైట్‌హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ నిర్మించారు. జి. వెంకటకృష్ణన్ దర్శకుడు. డబ్బు చుట్టూ తిరిగే కథా కథనాలకు యాక్షన్ అంశాలు కలిపి ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేశారు. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ..‘మణిశంకర్ అనే గ్యాంగ్ స్టర్ కథ ఇది. అతను చేసే భారీ డీలింగ్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథంతా నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది’ అన్నారు.