5 నిమిషాల్లో మరో ప్రపంచంలోకి
దర్శకుడు కేవీఆర్ మహేంద్రకూ, నాకూ, శివాత్మికకు డెబ్యూ మూవీ ‘దొరసాని’. ఆ సినిమా మా ముగ్గురికీ మంచి పేరు తెచ్చింది. మహేంద్ర రెండవ సినిమా అయిన ఈ ‘భరతనాట్యం’ కూడా నటించిన అందరికీ మంచి పేరు తీసుకురావాలి.
‘దర్శకుడు కేవీఆర్ మహేంద్రకూ, నాకూ, శివాత్మికకు డెబ్యూ మూవీ ‘దొరసాని’. ఆ సినిమా మా ముగ్గురికీ మంచి పేరు తెచ్చింది. మహేంద్ర రెండవ సినిమా అయిన ఈ ‘భరతనాట్యం’ కూడా నటించిన అందరికీ మంచి పేరు తీసుకురావాలి. నాకిష్టమైన క్రైమ్ కామెడీ జానర్లో ఈ సినిమా రూపొందింది. అందుకే సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’ అంటూ శుభాకాంక్షలు అందించారు యువహీరో ఆనంద్ దేవరకొండ. ఈ నెల 5న విడుదల కానున్న ‘భరతనాట్యం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా రూపొందిన ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పాయల్ సరాఫ్ నిర్మాత. ‘మా నాన్న ధని ఏలే ఈ సినిమాకోసం నాకంటే ఎక్కువ కష్టపడ్డారు. అద్భుతమైన టీమ్ ఈ సినిమాకు పనిచేసింది. మహేంద్ర అద్భుతంగా తీశారు.’ అని హీరో సూర్యతేజ ఏలే అన్నారు. ‘భరతనాట్యం’ అద్బుతమైన ఎంటర్టైనర్ అని, ఎక్కడ కూడా కొత్త హీరో సినిమాలా ఉండదని, సినిమా మొదలైన ఐదు నిమిషాల తర్వాత అందరూ మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారని, గొప్ప టీమ్ ఈ సినిమాకు పనిచేసిందని దర్శకుడు చెప్పారు. జీవితా రాజశేఖర్, హీరో నవదీప్, శివాత్మికతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

