Director Hari | సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. యముడు, సింగం 2 సినిమాల దర్శకుడు హరి (Hari) తండ్రి వీఏ గోపాలకృష్ణన్ (VA Gopalakrishnan) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇక గోపాలకృష్ణన్ అంత్యక్రియలు ఈరోజు టుటికోరిన్ జిల్లాలోని హరి స్వస్థలమైన కాచనవిలైలో జరగనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. అంతకుముందు ఆయన భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు చెన్నైలోని సాలిగ్రామంలోని హరి నివాసంలో సినీ ప్రముఖుల నివాళులర్పించేందుకు ఉంచారు.
కాగా.. హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2003లో సామి, 2010లో సింగం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న హరి ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం పలకరించలేదు.