Thunivu Movie | కేవలం ఒక్క సీన్ విని అజిత్ తునివు సినిమాను ఒకే చేశాడట..కానీ?
గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నేర్కొండ పార్వయ్, వలిమై సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా అజిత్ పూర్తి నమ్మకంతో ఉన్నాడట.
Ajith Kumar | తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈ ఏడాది ‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘తునివు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌవుతున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.
కాగా తాజాగా దర్శకుడు హెచ్. వినోద్ ఈ సినిమాపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అజిత్ ఈ సినిమా కథను పూర్తిగా వినలేదట. కేవల ఒక్క సీన్ విని కథను ఒకే చేశాడట. అయితే ఇప్పుడు ఆ సీన్‌ను సినిమా నుండి తొలిగించామని తెలిపాడు. ఒక్క సీన్‌తోనే అజిత్ సినిమాను ఓకే చేశాడంటే.. హెచ్. వినోద్‌పై ఎంత నమ్మకంతో ఉన్నాడో అని తెలుస్తుంది. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నేర్కొండ పార్వయ్, వలిమై సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా అజిత్ పూర్తి నమ్మకంతో ఉన్నాడట. అందుకే సినిమా ప్రమోషన్లపై ఇంట్రెస్ట్ చూపించడలేదట.
యాక్సన్ ఎంటర్టైనర్గా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన అజిత్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. త్వరలోనే చిత్రబృందం తెలుగు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. రాధాకృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాకు తెగింపు అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

