బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas ), అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం రాక్షసుడు (Rakshashudu). తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం రమేశ్ వర్మ(Ramesh Varma)కు డైరెక్టర్ గా మంచి బ్రేక్ ఇచ్చింది. బాక్సాపీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే రమేశ్ శర్మ రాక్షసుడు 2ను కూడా ప్రకటించాడు. టైటిల్‌తోపాటు శ్వాసను ఆపుకోండి అంటూ ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేశాడు.
రాక్షసుడు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాక్షసుడు 2 (Rakshashudu 2)అప్డేట్ అందించాడు రమేశ్ వర్మ. కిల్లర్ రక్తంతో నిండిన కసాయి కత్తిని చేతిలో పట్టుకుని ఉండగా..ఓ బాలిక భయంతో పరుగులు పెడుతుండటం పోస్టర్లో చూడొచ్చు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సారి థ్రిల్, సర్ప్రైజ్ రెట్టింపు ఉండబోతుంది. ఇది సీక్వెల్ కాదు..అంటూ ప్రకటించాడు రమేశ్ వర్మ. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కనిపిస్తాడని టాక్ నడుస్తోండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఏ స్టూడియోస్ ఎల్ఎల్పీ, మూవీ హిల్స్, హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ల పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.
3 Years For Spine-Chilling Thriller #Rakshasudu 🎭
We're Excited to Bring the #Rakshasudu2 with Double the Thrill and Suspense 💥
Shoot Starts Soon 🔥
Hold your Breath because We are coming with a Bang ❤️🔥 pic.twitter.com/TX7JzK0fhN
— Ramesh Varma (@DirRameshVarma) August 2, 2022