కొత్తగా మూడు చిత్రాలతో
లక్కీ మీడియా సంస్థలో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘మేం వయసుకు వచ్చాం’ వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్లో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘అల్లూరి’, సోహైల్ కథానాయకుడిగా ‘బూట్ కట్ బాలరాజు’ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి
లక్కీ మీడియా సంస్థలో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘మేం వయసుకు వచ్చాం’ వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్లో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘అల్లూరి’, సోహైల్ కథానాయకుడిగా ‘బూట్ కట్ బాలరాజు’ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. మరికొన్ని చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయి. బుధవారం బెక్కెం వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘నేను నిర్మాతగా మారి 16 ఏండ్లవుతున్నది. ఇంత పోటీలోనూ నా ప్రొడక్షన్లో విజయవంతమైన చిత్రాలు నిర్మించగలిగాం. మంచి కథలను ఎంపిక చేసుకోవడమే మా సంస్థ సక్సెస్‌కు కారణం.
ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా ‘అల్లూరి’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సోహైల్ ‘బూట్ కట్ బాలరాజు’ రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇంకొన్ని కథలు ఫైనలైజ్ చేస్తున్నాం. నేను మీడియా నుంచే వచ్చాను కాబట్టి జర్నలిజం నేపథ్యంలో పాత్రికేయులు గర్వపడే ఓ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందులో మీడియా గొప్పదనం చూపించబోతున్నాం. ఈ ఏడాది కనీసం మూడు చిత్రాలను చేయాలని సన్నాహాల్లో ఉన్నాం. ఏ వ్యాపారం అయినా అవగాహన తెచ్చుకున్నాకే చేయాలి. అలాగే చిత్ర నిర్మాణం గురించి తెలిసిన వాళ్లే నిర్మాతలుగా అడుగుపెట్టాలి. లేకుంటే తొలి చిత్రానికే నష్టాలు చూసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

