ఆలుమగల అగచాట్లు
‘నాకు సందేశాలివ్వడం ఇష్టం ఉండదు. ఎంటర్టైన్ చేయడమే ఇష్టం. సామాజిక బాధ్యతతో కూడిన వినోదభరిత చిత్రాలను చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. ‘డార్లింగ్' సినిమా ఆ కోవకు చెందినదే’ అంటున్నారు దర్శకుడు అశ్విన్‌రామ్.
‘నాకు సందేశాలివ్వడం ఇష్టం ఉండదు. ఎంటర్టైన్ చేయడమే ఇష్టం. సామాజిక బాధ్యతతో కూడిన వినోదభరిత చిత్రాలను చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. ‘డార్లింగ్’ సినిమా ఆ కోవకు చెందినదే’ అంటున్నారు దర్శకుడు అశ్విన్‌రామ్. ఆయన దర్శకత్వంలో ప్రియదర్శి, నభానటేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవెరి’ ఉపశీర్షిక. కె.నిరంజన్‌రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మాతలు.
ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్‌రామ్ విలేకరులతో ముచ్చటిచారు. ‘ఇందులో కథానాయికకు స్లిట్ పర్సనాలిటీ అనగానే ‘అపరిచితుడు’తో పోల్చి మాట్లాడుతున్నారు. నిజానికి ఈ రెండిటికీ అసలు పొంతనే లేదు. ‘అపరిచితుడు’లో సామాజిక సమస్యల్నీ టార్గెట్ చేస్తే, ‘డార్లింగ్’లో ఇంటి ఇష్యూస్‌ని డీల్ చేశాం. అలాగే ‘డార్లింగ్’ అనే టైటిల్ గురించి కూడా చర్చ నడుస్తున్నది. ఈ కథకు ‘డార్లింగ్’ టైటిల్ పర్ఫెక్ట్గా యాప్ట్. భార్యభర్తలు ప్రేమగా పిలుచుకునే పదం ‘డార్లింగ్’. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.’ అని తెలిపారు అశ్విన్‌రామ్.
ఈ సినిమాను పర్సనాలిటీ డిజార్డర్‌తో డీల్ చేశామని, అది సెన్సిటివ్ డిజార్డర్ అని అందుకే ఈ సినిమాకు యూ/ఏ ఇచ్చారని ఆయన అన్నారు. సెన్సార్‌వారు ఒక్క కట్ కూడా చెప్పలేదని, పెద్దల సమక్షంలో పిలల్లు కూడా చూడాల్సిన సినిమా ఇదని అశ్విన్‌రామ్ తెలిపారు. అట్లి ‘రాజారాణి’ సినిమాకి సహాయకునిగా పనిచేసి చాలా నేర్చుకున్నానని, ‘డార్లింగ్’లో భార్యభర్తల విభిన్న దృక్పధాన్ని ఆవిష్కరించామని ఆయన అన్నారు. నభా నటేశ్, ప్రియదర్శి సినిమాకోసం చాలా ఎఫర్ట్ పెట్టారని, అలాగే అనన్య నాగళ్ల ఇందులో ప్రత్యేకమైన పాత్ర పోషించారని, సినిమా బాగా రావడానికి ప్రధాన కారణం నిర్మాతలేనని, సాంకేతికంగా కూడా సినిమా అద్భుతంగా ఉంటుందని అశ్విన్‌రామ్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

