Valatty | పెంపుడు శునకాల సాహసం
మలయాళ చిత్రసీమను ప్రయోగాలకు చిరునామాగా అభివర్ణిస్తారు. చిన్న చిత్రాలు మొదలకొని భారీ కమర్షియల్ చిత్రాల వరకు అక్కడ కథల్లో వైవిధ్యతకే పెద్దపీట వేస్తారు. తాజాగా పెంపుడు కుక్కల సాహస కథతో రూపొందించిన ‘వాలాట్టి’ అనే చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
మలయాళ చిత్రసీమను ప్రయోగాలకు చిరునామాగా అభివర్ణిస్తారు. చిన్న చిత్రాలు మొదలకొని భారీ కమర్షియల్ చిత్రాల వరకు అక్కడ కథల్లో వైవిధ్యతకే పెద్దపీట వేస్తారు. తాజాగా పెంపుడు కుక్కల సాహస కథతో రూపొందించిన ‘వాలాట్టి’ అనే చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. 11 పెంపుడు శునకాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ పెంపుడు కుక్కల పాత్రలకు మలయాళీ నటులు కొందరు వాయిస్ ఓవర్ అందించారు.
దర్శకుడు దేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న మలయాళంలో విడుదల కానుంది. కేరళ మినహా ఈ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను కేఆర్జీ స్టూడియోస్ కార్తీక్ గౌడ దక్కించుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్రాజు విడుదల చేయబోతున్నారు. అడ్వెంచర్, కామెడీ అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని, భారతదేశంలో ఈ జానర్లో వస్తున్న తొలి చిత్రమిదేనని దర్శకుడు తెలిపారు. మలయాళంలో విడుదలైన వారం రోజుల తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమి ళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

