Dil Raju | ఏంటి.. దిల్ రాజు ఆ రెండు సీక్వెల్స్ ఈ యువ హీరోతో ప్లాన్ చేశాడా..!
Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లానింగ్స్ మాములుగా ఉండవు. ఆయన నిర్మించిన చిత్రాలు మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో ఆర్య, శతమానం భవతి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయి క్లాసిక్స్ గా కూడా నిలిచాయి. అయితే ఈ మూవీస్‌కి సీక్వెల్స్ తీస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది.
Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లానింగ్స్ మాములుగా ఉండవు. ఆయన నిర్మించిన చిత్రాలు మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో ఆర్య, శతమానం భవతి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయి క్లాసిక్స్ గా కూడా నిలిచాయి. అయితే ఈ మూవీస్‌కి సీక్వెల్స్ తీస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఇప్పటికే ఆర్య కు సీక్వెల్ గా ఆర్య 2 వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. గత సంవత్సరం దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ కూడా ప్రకటించాడు కానీ ఆ సినిమా నేను చేయట్లేదని శర్వానంద్ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా అనౌన్స్ అప్పట్నుంచి దాని గురించి మళ్ళీ ప్రకటన లేదు.
ఇటీవల దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఈ సినిమా ఎప్పుడు, ఎవరితో రూపొందుతుందనే చర్చ మొదలైంది. అయితే ఆర్య డైరెక్టర్ సుకుమార్, చిత్ర హీరో అల్లు అర్జున్ ఇప్పుడు ఆర్య 3లో స్థితిలో లేరు. పాన్ ఇండియా సినిమాలతో వారిద్దరు బిజీగా ఉన్న నేపథ్యంలో ఆర్య3 మాత్రం బన్నీ-సుకుమార్‌లో రాదని అర్ధమవుతుంది. అయితే సుకుమార్ పర్యవేక్షణలో కొత్త డైరెక్టర్ తో దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా ఆర్య 3 సినిమా తెరకెక్కిస్తారని టాక్ నడుస్తుంది.
ఇక శతమానం భవతి సీక్వెల్ సినిమా కూడా ఆశిష్ రెడ్డితోనే తీసే ప్లాన్ లో ఉన్నారట. శతమానం భవతి తీసిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే ఈ సినిమా ఉండనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి అసలు హీరోలను పక్కనపెట్టి ఆశిష్ రెడ్డితో ఈ సినిమాలు తీస్తే ఎంత వరకు వర్కవుట్ అవుతాయి అనేది చర్చనీయాంశంగా మారింది. ఆశిష్ రెడ్డి ఇప్పటికే రౌడీ బాయ్స్, లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమాలతో మెప్పించాడు. త్వరలో సెల్ఫిష్ సినిమాతో రాబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

