అంచనాలకు మించిన విజయమిది
ఈ సీజన్లో టాలీవుడ్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నది ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి రూపొందించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ…‘నిర్మాతల సహకారంతోనే ఎన్నో వైవిధ్యమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించాం. కార్తీక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫీ ఆకర్షణ అయ్యింది. మంచి చిత్రాలను ఆదరించి బతికిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ…‘మా సినిమాకు దక్కిన విజయం మమ్మల్ని ఉద్వేగానికి గురిచేస్తున్నది. ఇక్కడే కాదు ముంబైలో కూడా హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్నది. మా ఊహకు అందని విజయం లభించింది. ఇది ప్రారంభమే. కృష్ణాష్టమి పర్వదినం రాబోతున్నది. ఆ రోజున తప్పకుండా మీరంతా వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ఈ చిత్ర విజయాన్ని నిర్మాత నారాయణదాస్ కె నారంగ్ గారికి అంకితమిస్తున్నాం’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘కేవలం 50 స్క్రీన్లతో బాలీవుడ్లో రిలీజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 700 స్క్రీన్లకు చేరుకుంది. సినిమాలో సత్తా ఉంటే దాని విజయానికి హద్దులు ఉండవు. ‘పుష్ప’లా ఈ సినిమా బాలీవుడ్లో పెద్ద సక్సెస్ అవ్వాలి’ అన్నారు. ‘ఇదొక మంచి చిత్రం అని ప్రేక్షకులు చెప్పడమే మాకు దక్కిన పెద్ద విజయంగా భావిస్తున్నా, ఇందులో భాగమయ్యే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని చెప్పింది నాయిక అనుపమ పరమేశ్వరన్.
మమ్మల్ని బలి పశువులు చేయొద్దు
జూన్, జూలైలో ఇండస్ట్రీ పరిస్థితి ఏంటని భయమేసింది. ‘సీతారామం’, ‘బింబిసార’ ‘కార్తికేయ 2’ సాధించిన విజయాలు పరిశ్రమకు ఊపిరిపోశాయి. కథల ఎంపిక, మేకింగ్ వంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలని మాకు స్ఫూర్తినిచ్చే స్థాయి విజయాన్ని ఈ సినిమా అందుకుంది. జూలై 22న ‘కార్తికేయ 2’ విడుదల కావాలి. కానీ మా ‘థాంక్యూ’ కోసం అడగ్గానే వాళ్లు డేట్ మార్చుకున్నారు. నేను రిలీజ్ కోసం సపోర్ట్ చేస్తానన్నాను. మా మధ్య ఇలాంటి సహకారం ఉంటే కొన్ని మీడియాల్లో నేను ఈ సినిమాను అడ్డుకుంటున్నానని వార్తలు వచ్చాయి. నిర్మాతలంతా ఒకరి సినిమా విజయం సాధించాలని మరొకరం కోరుకుంటాం. అసత్యాలు రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actor Nikhil
- Dil raju
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

