మూవీ లవర్స్, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ (God Father) రానే వచ్చింది. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్…అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి ఏదో ఒక అప్డేట్తో సినీ జనాల్లో క్యూరియాసిటీని పెంచుతూ వస్తోంది. మరోవైపు ఆచార్య లాంటి ప్లాఫ్ అందుకున్న తర్వాత బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ ఫలితం ఎలా ఉండబోతుందోనన్న సస్పెన్స్ కూడా ఉంది.
రకరకాల వార్తలు, ఊహాగానాలు, అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చాడు గాడ్ ఫాదర్. మరి ఇప్పటివరకు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న అప్డేట్స్ ప్రకారం గాడ్ ఫాదర్ ఎలా ఉందో సంక్షిప్తంగా..
గాడ్ ఫాదర్ మేనియా ఎలా ఉందంటే..?
ముందుగా వచ్చిన అప్ డేట్ ప్రకారం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh ) ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాడు. ముఖ్యమంత్రి ఆస్పత్రిలో చేరడంతో బయట పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. అయితే సీఎం చనిపోవడంతో..నెక్ట్స్ సీఎం పీఠంపై ఎవరుంటారనేదానిపై రాజకీయాలు మొదలవుతాయి. అనంతరం సత్యదేవ్, నయనతార, మురళీశర్మ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత అద్బుతమైన ఎలివేషన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఉంటుంది.
చిరంజీవికి సంబంధించి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత సత్యదేవ్, మురళీశర్మ ఓ మాఫియా లీడర్‌ను కలిసేందుకు ముంబైకి వెళ్తారు. ఇక సినిమా చాలా సీరియస్‌గా సాగుతుంటుంది. సత్యదేవ్ తన లక్ష్యమేంటో చెబుతూ..సీఎం మరణం వెనుక ఎవరున్నారనేది చెబుతాడు. ఆ తర్వాత పొలిటికల్ గేమ్ ఆడుతూనే..చిరంజీవిని చర్చల కోసం పిలుస్తాడు. చిరంజీవి అద్బుతమైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో, సత్యదేవ్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సీరియస్‌గా ఫస్ట్ హాఫ్ సాగుతుంది.
సెకండాఫ్..
పొలిటికల్ సీన్లు, సల్మాన్ ఖాన్ గ్రాండ్ రీ ఎంట్రీ.. ఆతర్వాత నయనతార రావడం, చిరంజీవి జర్నలిస్టు పూరీ జగన్నాథ్‌ను పిలిచి ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చిన్న ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ .. అనంతరం బ్లాస్ట్ బేబీ సాంగ్ ఉంటుంది. విలన్స్‌తో చిరంజీవి, సల్మాన్ ఫైట్, పొలిటికల్ సీన్లతో సాగుతుంది. ఫైట్ తర్వాత ఫ్యాన్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూసే థార్ మార్ థక్కర్ మార్ సాంగ్ వస్తుంది. ఈ పాట చిరంజీవి అభిమానులకు కావాల్సిన అన్ని హంగులతో సాగుతూ విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌తో శుభం కార్డు పడుతుంది.
సమీక్ష: చిరంజీవి స్టైల్ ఆఫ్ మార్క్ గాడ్‌ఫాదర్‌లో కనిపిస్తుందని అంటున్నారు సినీ జనాలు. మరి గాడ్ ఫాదర్ కలెక్షన్లు, థియేటర్లలో రియాక్షన్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని షోలు అయితే క్లారిటీ రానుంది.