సుదీర్ఘ విరామం తర్వాత అక్కినేని నాగార్జున లీడ్ రోల్లో నటిస్తున్న వైల్డ్ డాగ్‌తో తెలుగు ప్రేక్షకులను పలుకరించేందుకు వస్తోంది బాలీవుడ్ నటి దియామీర్జా. ఈ చిత్రంలో నాగార్జున భార్యగా నటించింది దియామీర్జా. ఈ హైదరాబాదీ భామ వైల్డ్ డాగ్లో అవకాశం ఎలా వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. కాస్టింగ్ డిపార్టుమెంట్ మొదట నాకు ఫోన్ చేసింది.
డైరెక్టర్ అహిషోర్ సోలోమన్ ముంబైలో నన్ను కలిసి..కథ వినిపించారు. నాగ్ సార్ లీడ్ రోల్ చేస్తుండటం, కథ నచ్చడంతో సినిమాకు నో చెప్పలేకపోయాను. వెంకటేశ్, నాగార్జునతో కలిసి నటించాలన్నది నా కల. నాగార్జున, నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్. కానీ 20 ఏండ్ల తర్వాత నాగార్జునను కలిశాను. తొలి రోజు షూటింగ్ రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చినపుడు టెన్షన్ గా ఫీలయ్యా. కానీ నాగ్ సార్ చాలా కంపార్టబుల్గా సీన్ షూట్ పూర్తయ్యేలా చేశారు. నాగార్జునతో షూటింగ్ చేసిన టైం చాలా గొప్పదంటూ చెప్పుకొచ్చింది.