Premane Oorilo | బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘ప్రేమనే ఊరిలో’.. సాయికుమార్ ప్రశంసల వర్షం!
Dialogue King Sai Kumar | కన్నడ దర్శకుడు మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ఫీల్ గుడ్ మూవీ ‘ప్రేమనే ఊరిలో’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా, హైదరాబాద్ వేదికగా ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.
Dialogue King Sai Kumar | కన్నడ దర్శకుడు మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ఫీల్ గుడ్ మూవీ ‘ప్రేమనే ఊరిలో’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా, హైదరాబాద్ వేదికగా ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూణచ్చ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ వేడుకలో సాయికుమార్ మాట్లాడుతూ, ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం ఇప్పటికే తన విజయాన్ని ఘనంగా చాటుకుందని, ఇది ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిన సినిమా అని కొనియాడారు. మన మట్టి సువాసనలు ఉట్టిపడే ఈ చిత్రాన్ని త్వరలోనే తాను కూడా థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూస్తానని తెలిపారు. ఒక చక్కటి చెట్టు ప్రాముఖ్యత, రైతు గొప్పతనం, మరియు మనసును హత్తుకునే ఎమోషన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని, నటీనటులందరూ అంకితభావంతో అద్భుతమైన నటన కనబరిచారని ప్రశంసించారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మరింత పెద్ద బ్లాక్‌బస్టర్ చేయాలని పిలుపునిచ్చారు.
చిత్ర హీరో శ్రీరామ్ మాట్లాడుతూ, సాయికుమార్ లాంటి దిగ్గజ నటుడి ఆశీస్సులు తమ సినిమాకు దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, ఆయన అందించిన మాటలు తమ కెరీర్‌కు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూసి ఆనందించేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.
హీరోయిన్ తపస్విని పునాచ తన అనుభవాలను పంచుకుంటూ, కర్ణాటకలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులోనూ అదే స్థాయి ఆదరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. థియేటర్ విజిట్స్ సమయంలో ప్రేక్షకులు తమ పాత్రలను, సినిమాలో చూపిన అనుబంధాలను తమ నిజ జీవితంతో పోల్చుకుంటూ అభినందిస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పారు.
నిర్మాత మమత దేవేంద్ర మాట్లాడుతూ, సురేష్ కొండేటి తమ సినిమాను చూసి వెంటనే సానుకూలంగా స్పందించి, డబ్బింగ్ మరియు పాటల విషయంలో సహకరించడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ప్రేక్షకుల నుంచి వస్తున్న అనూహ్య స్పందన కారణంగా థియేటర్లు, స్క్రీన్ల సంఖ్యను పెంచామని వెల్లడించారు. ఒక చక్కటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందించామని, కరోనా అన్రింతర మారిన సినిమా డైనమిక్స్ మధ్య ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
మరో నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సినిమా చూసి తాను కూడా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నానని, తమకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. రంగాయణ రఘు, శ్రీరామ్, తపస్విని పూణాచా, రమిక శివు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్‌కాంత్ ఎస్.కే డీవోపీగా, హర్షిత్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరించగా, దేవేంద్ర ఎం క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, మనోజ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

