Dhruv | తెలుగులో అదరగొట్టిన విక్రమ్ తనయుడు.. సినిమా కోసం మూడేళ్లు కబడ్డీ నేర్చుకున్నానంటూ కామెంట్
Dhruv | తమిళంలో ఘన విజయాన్ని సాధించిన బైసన్ (Bison) సినిమా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్లో పా. రంజిత్ సమర్పణలో, సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ (Mari Selvaraj) తెరకెక్కించారు.
Dhruv | తమిళంలో ఘన విజయాన్ని సాధించిన బైసన్ (Bison) సినిమా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్లో పా. రంజిత్ సమర్పణలో, సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ (Mari Selvaraj) తెరకెక్కించారు. హీరోగా ధృవ్ విక్రమ్ (Dhruv Vikram), హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన ఈ చిత్రానికి సంగీతం నివాస్ కె. ప్రసన్న అందించారు. తెలుగు వెర్షన్ జగదంబే ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది.
తెలుగులో విడుదల అవుతున్న క్రమంలో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ, “తెలుగులో బైసన్ ప్రమోషన్ కోసం హైదరాబాదుకు రావడం నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో నేను మూడు సంవత్సరాలు కష్టపడ్డాను, కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్ల గురించి కాదు, ప్రేక్షకుల ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. మా నాన్న విక్రమ్ గారు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్ అయ్యారు. నేను కూడా ఆయనలాగే కష్టపడి, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 24న మా సినిమాను తప్పకుండా చూడండి,” అని అన్నారు. హాయ్ నాన్న డైరక్టర్ శౌర్య నాకు ఫ్రెండ్… తనే తెలుగులో నాకు రాసిచ్చారు అని కామెంట్ చేశాడు.. ఈ సినిమా చేసేటప్పుడు పలుమార్లు గాయపడ్డా. ఎడమ చెయ్యి కూడా విరిగింది… మూడు పళ్లు దెబ్బతిన్నాయి. పలు గాయాలయ్యాయి అని చెప్పుకొచ్చారు ధ్రువ్.
ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, “మారి సెల్వరాజ్ గారి మొదటి సినిమా నుంచే ఆయనతో పనిచేయాలని అనుకున్నాను. ఆ అవకాశం బైసన్ ద్వారా దక్కింది. ఈ మూవీ ద్వారా చాలా నేర్చుకున్నాను. ధృవ్ ప్యాషన్, డెడికేషన్ చూసి నిజంగా ఇంప్రెస్ అయ్యాను. తమిళంలో ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను అని అన్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన బైసన్ అర్జున అవార్డు గ్రహీత మణతి గణేశన్ జీవితంపై ఆధారపడి రూపొందించబడింది. సామాజిక భావాలు, క్రీడా స్ఫూర్తి, మానవ విలువల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా తమిళనాడులో ఘన విజయాన్ని సాధించి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతోంది.
ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్‌కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి…
రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks
— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bison
- dhruv
- Mari Selvaraj
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

