సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అతిథిగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని వి.వి.వినాయక్ పేర్కొన్నారు.
ఇందులో రాసిన ఐదు పాటలు ఎంతో సంతృప్తినిచ్చాయని, ‘రంగస్థలం’ తర్వాత అంత గొప్ప సాహిత్యం అందించే అవకాశం లభించిందని గీత రచయిత చంద్రబోస్ తెలిపారు. యథార్థ సంఘటనల నేపథ్యంలో ఫిక్షనల్ స్టోరీ ఇదని, చక్కటి సందేశం..వినోదంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహావీర్ ఏలేందర్, సంభాషణలు: అస్లాం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞానప్రభ తోట.