ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘జగమే తంతిరం’. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రేక్షకులు ‘జగమే తంతిరం’ సినిమాను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18న ప్రసారం కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ముంచి స్పందన లభిస్తుంది. అలాగే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా కంప్లీట్ మ్యూజిక్ ఆల్బమ్‌ను సోనీ మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. జేమ్స్ కాస్మో, ఐశ్వర్యా లక్ష్మీ, జోసెఫ్ జోజు జార్జ్, కలైయారసన్, శరత్ రవి, రోమన్ ఫియోరీ, సుందరరాజ, దురై రామచంద్రన్, మాస్టర్ అశ్వత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.