Thiruchitrambalam Trailer | తమిళ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగు డబ్బింగ్లో అడపా దడపాగా విడుదలవుతూ ఉండేవి. అయితే ‘రఘువరన్ B-Tech’ ధనుష్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక చిత్రం తర్వాత ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘తిరుచిత్రంబలం’ ఒకటి. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ధనుష్ ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో నటించాడు. నిత్యామీనన్ ఫ్రెండ్ పాత్రలో నటించింది. రాశీఖన్నా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్‌ను గమినిస్తే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. ధనుష్, నిత్యామీనన్ ఫ్రెండ్ షిప్ సినిమాలో కీలకపాత్ర వహించనున్నట్లు తెలుస్తుంది. మధ్య మధ్యలో భారతిరాజాతో ధనుష్ చేసే కామెడీ అలరిస్తుంది. హీరో తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్ స్ట్రిక్ట్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. అనిరుధ్ రవిచందర్.