కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man). యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పిలువబడే రూసో బ్రదర్స్ ఆంటోని, జో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే టైటిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
లాస్ ఏంజెల్స్ లో ఈ సినిమా ప్రీమియర్ జరిగింది. ఈవెంట్ చిత్రయూనిట్ హాజరైంది. ది గ్రే మ్యాన్ ప్రీమియర్ ఈవెంట్‌కు ధనుష్ తన కుమారులు యాత్ర, లింగాతో కలిసి హాజరయ్యాడు. తండ్రీ కొడుకులు బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ షూట్లలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈవెంట్ ఫొటోలను ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
జులై 12న ఎంపిక చేయబడ్డ థియేటర్లలో ది గ్రే మ్యాన్ విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో జులై 22న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని AGBO, Roth Kirschenbaum Films సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.