Thamizh Murugan | ధనుష్-వెట్రిమారన్ కాంబోలో ‘తమిళ్ మురుగన్’.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ గ్లింప్స్!
Dhanush Vetrimaaran Movie Update | కోలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది.
Dhanush Vetrimaaran Movie Update | కోలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న 5వ చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ (Thamizh Murugan) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ప్రకటిస్తూ, చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ఫస్ట్ లుక్ ప్రోమోను విడుదల చేసింది. ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమా అంతా దైవిక, పౌరాణిక లేదా హిస్టారికల్ యుద్ధ నేపథ్యంలో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. గ్లింప్స్‌లో ధనుష్ ఒక పెద్ద సైన్యం ముందు, ఏనుగుపై గంభీరంగా కూర్చుని మురుగన్ స్వామి ఆయుధమైన ‘వేల్’ (ఈటె) పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. తమిళ ప్రజల, తమిళ నేలల శాశ్వత రక్షకుడు, యోధుడు, రాజు, నాయకుడు అంటూ ధనుష్ ఈ గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రముఖ రచయిత అరివుమతి రాసిన పుస్తకం, సంగం సాహిత్యంలో నమోదైన తమిళ మురుగన్ చరిత్ర ఆధారంగా ఈ కథ ఉండబోతోంది.
ఈ చిత్రానికి ప్రస్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ సంచలనం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ధనుష్ తన స్వంత బ్యానర్ ‘వుండర్‌బార్ ఫిల్మ్స్’ తో పాటు ‘ప్రొడక్షన్ మైల్స్ టు గో’ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కూడా మురుగన్ స్వామి (గాడ్ ఆఫ్ వార్) నేపథ్యంలో ఒక సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే సమయంలో తమిళం నుంచి ధనుష్-వెట్రిమారన్ కూడా అదే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ప్రకటించడంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ పీరియాడిక్ క్లాసిక్ చిత్ర షూటింగ్, మిగతా నటీనటుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

