Sankranthi Movies | ఎంత ధైర్యం.. ఏం చూసుకుని వస్తున్నారు ఆ హీరోలు..?
Sankranthi Movies | ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు డబ్బింగ్ హీరోలను చూసిన తర్వాత ఇదే అనిపిస్తుంది. అరే తాను దూర సందులేదు మెడకో డోలు అన్నట్లుంది ఇప్పుడు సంక్రాంతికి అనువాద సినిమాల పరిస్థితి. మన సినిమాలకే థియేటర్లు అడ్జస్ట్ అయ్యేలా కనిపించట్లేదు.. ఉన్న వాళ్లు ఎలా థియేటర్స్ పంచుకోవాలో అర్థం కావడం లేదు..
Sankranthi Movies | ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు డబ్బింగ్ హీరోలను చూసిన తర్వాత ఇదే అనిపిస్తుంది. అరే తాను దూర సందులేదు మెడకో డోలు అన్నట్లుంది ఇప్పుడు సంక్రాంతికి అనువాద సినిమాల పరిస్థితి. మన సినిమాలకే థియేటర్లు అడ్జస్ట్ అయ్యేలా కనిపించట్లేదు.. ఉన్న వాళ్లు ఎలా థియేటర్స్ పంచుకోవాలో అర్థం కావడం లేదు.. అగ్ర నిర్మాతలు కూడా ఈ విషయంలో ఏం చేయలేక తప్పుకుంటున్నారు.. సైలెంట్‌గా ఉన్నారు.. ఇలాంటి సమయంలో తగదునమ్మా అంటూ వస్తున్నారు డబ్బింగ్ హీరోలు. ఎంత ప్రయత్నించినా 5 సినిమాలకు సరిపోయే స్క్రీన్స్ మన దగ్గర ఉన్నాయా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1800 యాక్టివ్ స్క్రీన్స్ ఉన్నాయి. అందులో మన సినిమాలకే పంచేస్తారు అనడంలో సందేహం లేదు.
ఇలాంటి సమయంలో డబ్బింగ్ హీరోలకు థియేటర్స్ ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం. అయినా కూడా పట్టు వదలకుండా వాళ్లు కూడా వచ్చేస్తున్నారు. వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేలా ఉన్నారు నిర్మాతలు. కానీ అలా ఎలా చేస్తారు.. మావి కూడా పాన్ ఇండియన్ సినిమాలే కదా.. అన్నిభాషల్లో ఒకేరోజు విడుదల చేసుకోవాలి కదా అంటున్నారు. వాళ్ల గోడు మన నిర్మాతలు వింటారా.. వాళ్లకు కూడా సరిపోయే థియేటర్స్ ఇస్తారా అనేది ఇప్పుడు చెప్పలేం. మరోవైపు పండక్కి అనువాద చిత్రాలు వాయిదా వేసుకోవడమే మంచిదని దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు.
గుంటూరు కారంతో పాటు హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగా సినిమాలకు సరిపడా స్క్రీన్లు మన దగ్గర లేవు. ఈ విషయంలో ఇప్పటికే నిర్మాతలు, బయ్యర్ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే పండగ సినిమాలు కదా అని అందరూ డబుల్ రేట్లు చెప్తున్నారు. మరోవైపు థియేటర్స్ లేనపుడు అన్ని కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయనేది ఎవరూ చెప్పడం లేదు. మన సినిమాలకు థియేటర్స్ ఇవ్వలేక చుక్కలు చూస్తున్న మాకు.. కెప్టెన్ మిల్లర్, అయలాన్, లాల్ సలామ్ లాంటి డబ్బింగ్ మూవీస్‌ను తమ నెత్తి మీద పెట్టొద్దని స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ ధనుష్, శివకార్తికేయన్ మాత్రం వినట్లేదు.
రజినీకాంత్ ఎలాగోలా తన సినిమాను మరో సమయంలో తీసుకురావాలని చూస్తున్నాడు కానీ మిగిలిన ఇద్దరూ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. జనవరి 12నే అయలాన్ విడుదల చేస్తాం అంటూ మరోసారి నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. మరోవైపు ధనుష్ కెప్టెన్ మిల్లర్ నుంచి కూడా ఓ పాట విడుదలైంది. అందులోనూ రిలీజ్ డేట్ జనవరి 12 అనే కనిపిస్తుంది. ఈ లెక్కన ఒకేరోజు గుంటూరు కారం, హనుమాన్, శివకార్తికేయన్ అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు రావాల్సి ఉంటుంది. మరి అది జరుగుతుందా.. అసలే హనుమాన్కు కూడా సరిపోయే థియేటర్స్ ఇవ్వడం లేదు అంటే ధనుష్, శివకార్తికేయన్ వచ్చి థియేటర్లు అడగడం అనేది కామెడీగానే ఉంటుంది. మరి దీనికి మన వాళ్ల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

