The Warriorr | ‘ది వారియర్’ నుంచి ‘దడ దడ’ సాంగ్ రిలీజ్.. మరోసారి మాయ చేసిన దేవీ శ్రీ ప్రసాద్!
The Warriorr Songs | రామ్ పోతినేని ప్రస్తుతం సినిమాల జోరును పెంచుతున్నాడు. ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాను ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలనున్నాయి. అందులో ఒకటి విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోకటి త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది. ఇంకోటి చర్చల దశలో ఉంది. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లలో ఉన్న రామ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి బ్రేక్ ఇచ్చింది. పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్.. తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరచుకున్న రామ్ ఈ చిత్రంతో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే భావనతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు.
ఈ క్రమంలోనే గతేడాది ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ పాత్రకు మాస్ ఆడియెన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈయన ‘ది వారియర్’ అనే మరో మాస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘దడ దడ’ సాంగ్ విడుదలైంది.
‘దడ దడ మని హృదయం శబ్ధం’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను హరిచరణ్ అద్భుతంగా ఆలపించాడు. దేవీ శ్రీ ప్రసాద్ మరో మెలోడీ ట్యూన్‌తో ప్రేక్షకులను మాయ చేశాడు. సుజిత్ వాసుదేవ్ కెమెరా విజువల్స్ బాగున్నాయి. రామ్,కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ‘బుల్లెట్’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు ఈ పాట నాలుగున్నర కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరీ నిర్మిస్తున్నాడు. రామ్‌కు జోడీగా కృతిశెట్టి నటించగా, ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. ద్విభాష చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

