నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డీఎస్‌జే’(దయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకుడు. క్రాంతి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలకానుంది. నట్టికుమార్ మాట్లాడుతూ ‘చిన్న సినిమాలకు అనుకూలంగా టికెట్ల ధరలు ఉండేలా నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి, అందుకు చొరవ చూపిన తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. తనకు జరిగిన అన్యాయంపై ఓ ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే, గ్రాఫిక్స్ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపారు. మహిళా ప్రధాన సినిమా ద్వారా కథానాయికగా పరిచయం కానుండటం ఆనందంగా ఉందని నట్టి కరుణ చెప్పింది. సుపర్ణ మలాకర్, బాబూమోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్.