దయ్యం ప్రతీకారం

నట్టి కరుణ, రాజీవ్, సుపూర్ణ మాలకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డీఎస్‌జే’(దయ్యంతో సహజీవనం). నట్టి కుమార్ దర్శకుడు. క్రాంతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను శనివారం విడుదలచేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘చదువులో బంగారుపతకం సాధించిన ఓ యువతిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారిపై ఆమె ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నదన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. షూటింగ్ పూర్తయింది. కశ్మీర్లో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. బాబుమోహన్, హేమంత్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రవిశంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

