అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించే ఆంగ్లేయుల గూఢచారిగా నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన చిత్రం ‘డెవిల్’. స్వతంత్య్రానికి పూర్వం జరిగే కథాంశంతో అభిషేక్ నామా స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంయుక్తా మీనన్ కథానాయిక.
ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులోని ఓ లిరికల్ సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘దూరమే తీరమై..‘ అంటూ సాగే ఈ పాటకు హర్షవర్ధ్దన్ రామేశ్వర్ స్వరపరచగా సమీర భరద్వాజ్ స్వయంగా రాసి ఆలపించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు రచన: శ్రీకాంత్ విస్సా, కెమెరా: సౌందర్ రాజన్.