కంకణం కట్టుకొని నవ్విస్తారు!
‘ఎఫ్-3’ చిత్రం రెండున్నర గంటలు పాటు పొట్టచెక్క లయ్యే వినోదాన్ని పంచుతుందని, పాటలన్నీ ప్రేక్షకుల్లో జోష్ని నింపుతాయని చెప్పారు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘ఎఫ్-3’ చిత్రం రెండున్నర గంటలు పాటు పొట్టచెక్క లయ్యే వినోదాన్ని పంచుతుందని, పాటలన్నీ ప్రేక్షకుల్లో జోష్ని నింపుతాయని చెప్పారు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర స్వరకర్త దేవిశ్రీప్రసాద్ పాత్రికేయులతో ప్రత్యేకంగా సంభాషించారు.
‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఈ విజయం మీపై బాధ్యతను మరింతగా పెంచిందనుకుంటున్నారా?
నా పాట అన్ని భాషల సంగీత ప్రియుల్ని మెప్పించడం చాలా ఆనందంగా ఉంది. సంగీతం అంటేనే ప్రతి హృదయాన్ని స్పశించే బలమైన భావోద్వేగం. ‘పుష్ప’ సినిమా విషయంలో అన్నీ అద్భుతంగా కుదిరాయి. కథలోని ఎమోషన్‌తో సహానుభూతి చెందే విధంగా పాటలు తయారయ్యాయి. నా పాటలు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా.
సాధారణంగా సీక్వెల్ అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ‘ఎఫ్-3’ మ్యూజిక్ విషయంలో ఎలాంటి కసరత్తులు చేశారు?
దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తుంటే ఒత్తిళ్లన్నీ మటుమాయమై పోతాయి. డైలాగ్, యాక్షన్‌తో పాటు కథ నరేట్ చేయడం వల్ల కళ్ల ముందు సినిమా చూసినట్లు అనిపిస్తుంది. ‘ఎఫ్-3’ కథ చెప్పినప్పుడు కూడా నేను అలాగే ఫీలయ్యా. ఈ సినిమాలో ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలే’ అనే సాంగ్ అందరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి వేడుకలో విని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇక ‘డబ్బు డబ్బు..’ అనే పాట కాస్త ఫిలాసఫికల్ టచ్‌తో మెప్పిస్తుంది. ఇలా పాటలన్నీ సందర్భోచితంగా బాగా కుదిరాయి.
ఐటెంసాంగ్స్‌తో మెప్పించడం అంత సులభం కాదు..మీరు మాత్రం కెరీర్ ఆరంభం నుంచి అద్భుతమైన ఐటెంసాంగ్స్ అందిస్తున్నారు?
ప్రత్యేక గీతాల్లో ప్రేక్షకులకు ఫన్ అందించడమే ముఖ్య ఉద్ధేశ్యంగా ఉంటుంది. ఐటెంసాంగ్ ఫలాన రీతిలో ఉండాలన్న నియమమేమీ ఉండదు. ఎప్పుడైతే రూల్స్ ఉండవో పాటను భిన్న కోణాల్లో ఆవిష్కరించే విస్తృతి పెరుగుతుంది. ఐటెంసాంగ్స్ విషయంలో నేను కొత్తగా ఆలోచిస్తా. అందుకే సూపర్‌హిట్ పాటలొచ్చాయి.
దిల్‌రాజుగారితో సుదీర్ఘకాలంగా ప్రయాణం సాగిస్తున్నారు. మీ ఇద్దరి అనుబంధం ఎలా ఉంటుంది?
నేను ఆయన కుటుంబ సభ్యుడిలా మారిపోయా. సినిమాను అమితంగా ప్రేమించే వ్యక్తుల్లో దిల్‌రాజుగారు ఒకరు. ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ.. సినిమా పట్ల ఆయనకున్న పాషన్ కొంచెం కూడా తగ్గలేదు. సినిమాల పట్ల ప్రేమే మా ఇద్దరిని మరింత దగ్గర చేసింది. దిల్‌రాజుగారికి నా జడ్జ్మెంట్ మీద బాగా నమ్మకం. నేను పనిచేయని సినిమాల విషయంలో కూడా ఫోన్ చేసి సలహాలు అడుగుతుంటారు.
‘ఎఫ్-3’ సినిమాకు మీ కెరీర్లో ఎలాంటి ప్రత్యేకత ఉంది?
కామెడీ సినిమా తీయడం అంత సులభం కాదు. కొన్ని సినిమాల్లో కామెడీ ట్రాక్‌లు మాత్రమే నవ్విస్తాయి. కానీ ‘ఎఫ్-3’లో ప్రతి సీన్ నవ్వుల్ని పంచుతుంది. ప్రేక్షకుల్ని ఛాలెంజ్ చేసి నవ్వించే విధంగా ఉంటుంది. ‘ఎఫ్-2’ చిత్రానికి పదింతల కామెడీ ఉంటుంది. ఆర్ఆర్ చేసినప్పుడు పడీపడీ నవ్వుకున్నా. తెలుగులో చాలా రోజుల తర్వాత వస్తున్న ఫుల్‌లెంగ్త్ కామెడీ చిత్రమిది. ప్రతి ఒక్కరిని కంకణం కట్టుకొని నవ్వించారనే భావన కలుగుతుంది. కామెడీతో పాటు డబ్బు గురించి మంచి సందేశాన్ని అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

