Devara Movie | దేవర మూవీ బిగ్ అప్డేట్.. తగ్గేదేలే..!
Jr.Ntr | జనతా గ్యారేజ్ వంటి బంపర్ హిట్ తర్వాత తారక్-కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో నందమూరి అభిమానుల్లోనే కాదు సినీ ప్రేక్షకుల్లో సైతం తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Jr.Ntr | ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఇటీవలే దేవర సెట్లోకి అడుగుపెట్టాడు తారక్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. లేటెస్ట్గా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. రగ్గుడ్ లుక్‌లో, రక్తపు మరకలతో ఉన్న తారక్ పోస్టర్ అభిమానులనే కాదు, సినీ లవర్స్‌ను సైతం ఉర్రూతలూగించింది. అసలు సిసలైన మాస్ అవతారంలో తారక్‌ను చూపించాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలపై పొగడ్తల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా అదే స్పీడ్‌తో షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ను ప్రకటించారు. లెటెస్ట్‌గా ఈ సినిమా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో చిత్రయూనిట్ శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.
It’s a wrap for an amazing action sequence. 🔥🔥🔥 #Devara https://t.co/rbA56sehLm
— Devara (@DevaraMovie) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

