Devara Movie | అప్పుడే దేవర కోసం రెండు ట్యూన్స్ సిద్ధం.. అనిరుధ్ స్పీడ్ మాములుగా లేదుగా..!
Devara Movie | ప్రస్తుతం అనిరుధ్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో దేవర ఒకటి. తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.
Devara Movie | ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ నేపథ్య సంగీతం గురించి మాట్లాడని సినీ ప్రేక్షకుడు లేడు. హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ మ్యూజిక్కు అభిమానులు చొక్కాలు చింపుకుని చిందులేస్తున్నారు. విక్రమ్‌లో కమల్‌కు, జైలర్‌లో రజనీకు అనిరుధ్ ఇచ్చిన మాస్ మ్యూజిక్కు తమిళ తంబిలే కాదు.. తెలుగు కుర్రాళ్లు సైతం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో దేవర ఒకటి. తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాను చుట్టేస్తుంది. ఈ సినిమా కోసం అనిరుధ్ అప్పుడే రెండు పాటలను కూడా రెడీ చేశాడట. చిత్రయూనిట్ వాటిని ఒకే కూడా చేసిందని ఇన్ సైడ్ టాక్. ఇక అందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందట. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్‌లో నర్తించడం కోసం ఓ స్టార్ హీరోయిన్‌కు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలుస్తుంది.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. జాన్వీకి సంబంధించిన కీలక ఎపిసోడ్ షూట్ ఈ నెలలో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

