Devara | సోషల్ మీడియాను ఊపేస్తున్న దేవర సినిమా లీక్.. ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!
Devara Movie | ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాల్లేవు. దానికి తోడు మరో వైపు పలు లీకుల ప్రవాహంతో సినిమాపై అంతకంతకూ హైప్ పెరుగుతూనే ఉంది.
Devara Movie | ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాల్లేవు. దానికి తోడు మరో వైపు పలు లీకుల ప్రవాహంతో సినిమాపై అంతకంతకూ హైప్ పెరుగుతూనే ఉంది. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీమ్ డిజైన్ చేస్తుందట. తారక్ సైతం వాటికోసం ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇక అండర్ వాటర్ సీన్ అయితే మరో అద్భుతమట. సిల్వర్ స్క్రీన్‌పై ఆ సన్నివేశం చూసినప్పుడు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరట. ఇలాంటి లీకులు నందమూరి అభిమానుల్లోనే కాదు సగటు ఆడియెన్స్‌లో సైతం అంతులేని అంచనాలు నెలకొల్పుతున్నాయి.
ప్రస్తుతం ఎడతెరపు లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూ్ల్స్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అదే స్పీడ్‌తో ముందుకు కదులుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో లీక్ నెట్టింట దుమారం రేపుతుంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వీర లెవల్లో ఉండబోతుందట. ఫ్లాష్ బ్యాక్‌లో తారక్ తండ్రి పాత్రలో కనిపిస్తాడట. అంతేకాకుండా బాహుబలి సినిమాలాగా ఒకే స్క్రీన్‌పై ఇద్దరూ ఎన్టీఆర్‌లు కనిపించే చాన్స్ లేదని తెలుస్తుంది. అంతేకాకుండా స్టోరీలో చాలా స్కోప్ ఉండటంతో దేవరను రెండు భాగాలుగా తీసే ఆలోచన కూడా చిత్రబృందంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. జాన్వీకి సంబంధించిన కీలక ఎపిసోడ్ షూట్ ఈ నెలాఖరులో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

