Devara Ayudha Pooja | మెంటల్ మాస్.. ‘దేవర’ నుంచి ఆయుధ పూజ సాంగ్ ప్రోమో
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఆయుధ పూజ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ”ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు. కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగ ఆడెను చూడు. హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె.” అంటూ ఫుల్ మాస్ బీట్తో సాగిన ఈ పాట అభిమానులకు పండగ అని చెప్పుకోవాలి. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాలా భైరవ పాడాడు. అనిరుధ్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

