Bandla Ganesh | దేవర నా టైటిల్.. కొట్టేశారు.. బండ్ల గణేశ్ హాట్ కామెంట్స్
Bandla Ganesh | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ 30 (NTR 30). కాగా ఎన్టీఆర్ 30కి దేవర అనే టైటిల్‌ను దాదాపు ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Bandla Ganesh | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ 30 (NTR 30). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఎన్టీఆర్ 30కి దేవర అనే టైటిల్‌ను దాదాపు ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఫస్ట్ లుక్ లాంఛ్ కూడా కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.
ట్విట్టర్లో ఓ వ్యక్తి ‘ఎన్టీఆర్ 30.. ఎలా ఉంది.. దేవర అంటే..’అని పెట్టిన ట్వీట్ కు బండ్ల గణేశ్ స్పందిస్తూ.. ‘దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారని ఆసక్తికర రీట్వీట్ చేశారు. అయితే ఇలా టైటిల్ కొట్టేయడం వల్ల తనకేం ప్రాబ్లం లేదని, ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరేనని’ చెప్పుకొచ్చాడు బండ్ల గణేశ్.
ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ 30ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023
నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్ ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే ❤️ https://t.co/Ad1wIqIfYB
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

