Devara 2 | ‘దేవర 2’ ఆగిందంటూ ప్రచారాలు .. అభిమానుల సందేహాలకు చెక్
Devara 2 | టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో ‘దేవర 2’ ఒకటి. కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో నందమూరి అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ, నందమూరి బాలకృష్ణతో కొత్త సినిమా ఖరారు చేసుకోవడంతో ‘దేవర 2’ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే వార్తలు జోరుగా వినిపించాయి.
Devara 2 | టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో ‘దేవర 2’ ఒకటి. కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో నందమూరి అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ, నందమూరి బాలకృష్ణతో కొత్త సినిమా ఖరారు చేసుకోవడంతో ‘దేవర 2’ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే వార్తలు జోరుగా వినిపించాయి. ఇక హీరో ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, కొరటాల శివ ఇతర సినిమాలపై దృష్టి పెట్టడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. దీంతో ‘దేవర’ సీక్వెల్ ఉంటుందా లేదా అన్న సందేహం అభిమానులను కలవరపెట్టింది.
అయితే తాజా సమాచారం ప్రకారం అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ‘దేవర 2’ కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఎన్టీఆర్‌కు కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్నప్పటికీ, ఈ కాంబినేషన్లో సీక్వెల్ రావడం ఖాయం అనే సంకేతాలు అందుతున్నాయి.మరోవైపు బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక, 2027 జనవరి నాటికి కొరటాల శివ ఫ్రీ అవుతారని సమాచారం. ఆ వెంటనే ‘దేవర 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
దీంతో కొంత ఆలస్యమైనా, ‘దేవర 2’ ప్రాజెక్ట్ మాత్రం ఆగిపోలేదని స్పష్టమవుతోంది. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు ఇంకొంతకాలం వేచి చూడాల్సి ఉన్నా, వారు ఎదురుచూస్తున్న సీక్వెల్ మాత్రం ఖచ్చితంగా రానుందని చెప్పొచ్చు. దేవర చిత్రం మంచి విజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్‌పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

