ఈ కథపై అశోక్ పేరు రాసుంది
‘ఈ కథ రాసుకున్న తర్వాత చాలామంది హీరోలు మదిలో మెదిలారు. కానీ చివరకు ఇది గల్లా అశోక్ పరమైంది. దీనిపై అతని పేరు రాసుంది. సినిమా చూశాను. చాలా బావుంది. అర్జున్ అద్భుతంగా తీశారు. నిర్మాత బాలకృష్ణ సోమినేని ఖర్చుకు వెనుకాడలేదు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది.’
‘ఈ కథ రాసుకున్న తర్వాత చాలామంది హీరోలు మదిలో మెదిలారు. కానీ చివరకు ఇది గల్లా అశోక్ పరమైంది. దీనిపై అతని పేరు రాసుంది. సినిమా చూశాను. చాలా బావుంది. అర్జున్ అద్భుతంగా తీశారు. నిర్మాత బాలకృష్ణ సోమినేని ఖర్చుకు వెనుకాడలేదు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది.’ అని డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ అన్నారు. ఆయన కథ అందించిన చిత్రం ‘దేవకీనందన వాసుదేవ’. అశోక్ గల్లా హీరోగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్ర కథకుడు ప్రశాంత్‌వర్మ మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, దగ్గుబాటి రానా, సందీప్‌కిషన్‌లు యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘అద్భుతమైన కథను అందించిన ప్రశాంత్‌వర్మకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
దర్శకుడు అర్జున్ జంధ్యాల తన విజన్‌తో ఈ కథకు ప్రాణం పోశారు. ట్రైలర్‌ని మించేలా సినిమా ఉంటుంది’ అని అశోక్ గల్లా నమ్మకం వెలిబుచ్చారు. ప్రశాంత్‌వర్మ కథ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, భీమ్స్ సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టాయని దర్శకుడు చెప్పారు. ఇంకా కథానాయిక మానస వారణాసితోపాటు చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

