జై కృష్ణ.. జై బోలో కృష్ణ..
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. వారణాసి మానస కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత.
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. వారణాసి మానస కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాటకు ఆడియన్స్‌లో మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శుక్రవారం రెండో పాటను విడుదల చేశారు.
‘జై కృష్ణ.. జై బోలో కృష్ణ.. కృష్ణ కృష్ణ..’ అంటూ సాగే ఈ పాటను రఘురామ్ అడ్వకేట్ రాయగా, భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. స్వరాగ్ కీర్తన్ ఆలపించారు. సినిమాలో కృష్ణజన్మాష్టమి సందర్భంగా వచ్చే పాట ఇదని చిత్రీకరణ చెప్పకనే చెబుతున్నది. యష్ మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్, అశోక్ గల్లా ఎనర్జీ పాటకు కొత్త ఊపును తెచ్చాయని మేకర్స్ చెబుతున్నారు.
స్పిరిచ్యువల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: ప్రశాంత్‌వర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, నిర్మాణం: లలితాంబిక ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

