ఎల్లమ్మ లగ్గం నుంచి బోనాల వరకు..
‘హైదరాబాద్‌లో జరిగే సాంస్కృతిక వేడుకలు, పండగల నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక బ్యాండ్ కొట్టుకునే యువకుడి జీవితానుభవాలకు దర్పణంలా ఉంటుంది.
‘హైదరాబాద్‌లో జరిగే సాంస్కృతిక వేడుకలు, పండగల నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక బ్యాండ్ కొట్టుకునే యువకుడి జీవితానుభవాలకు దర్పణంలా ఉంటుంది. ఎల్లమ్మ లగ్గం నుంచి బోనాల వరకు, వినాయక చవితి, సదర్ ఇలా హైదరాబాద్ సంస్కృతిని ఆవిష్కరిస్తుందీ చిత్రం’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆశిష్ కథానాయకుడిగా దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘దేత్తడి’. ఆదిత్యరావు గంగసాని దర్శకుడు. మంగళవారం గ్లింప్స్‌ని విడుదల చేశారు.
ఇందులో హైదరాబాద్ డ్రమ్మర్ ఘన్ను భాయ్ పాత్రలో ఆశిష్ కనిపించారు. అతని హైదరాబాదీ యాస హైలైట్‌గా నిలిచింది. హైదరాబాద్ కల్చర్‌ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి గొప్పగా చూపించబోతున్నామని దిల్ రాజు అన్నారు. మన పండగలు, మన పాటలు, హైదరాబాద్ సంస్కృతి..అన్నీ కలబోసిన సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, కథ, దర్శకత్వం: ఆదిత్య రావు గంగసాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

