Aaradhya Bachchan: ఆరాధ్య బచ్చన్‌పై ఫేక్ న్యూస్ తొలగించండి.. యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశం
Aaradhya Bachchan: అమితాబ్ మనవరాలిపై ఫేక్ న్యూస్‌ను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. దీంతో అమితాబ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు యూట్యూబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరాధ్యపై పోస్టు చేసిన కాంటెంట్‌ను డిలీట్ చేయాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మనువరాలు ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)పై ఇటీవల యూట్యూబ్(Youtube)లో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దీంతో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇవాళ యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఆ వార్తలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయరాదు అని యూట్యూబ్‌ను హెచ్చరించింది.
యూట్యూబ్‌లో 11 ఏళ్ల ఆరాధ్య ఆరోగ్యం గురించి ఇటీవల ఫేక్ న్యూస్ రిపోర్ట చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిలదీసింది. తప్పుడు కాంటెంట్‌ను పోస్టు చేయకుండా ఉండే పాలసీలు ఏమీ లేవా అని కోర్టు యూట్యూబ్‌ను ప్రశ్నించింది. యూజర్లకు ఓ ఫ్లాట్‌ఫామ్ ఇచ్చేశాం, వాళ్లు ఏది పోస్టు చేసినా తమకు బాధ్యత లేదన్నట్లు యూట్యూబ్ వ్యవహరించడం సరికాదు అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
ఐశ్వర్య వేసిన పిటిషన్ ఆధారంగా గూగుల్, యూట్యూబ్‌కు సమన్లు జారీ చేశారు. ఐటీ రూల్స్ ప్రకారం తమ పాలసీలను మార్చుకున్నారా లేదా అని ప్రశ్నించింది. ప్రతి చిన్నారికి గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కు ఉందని, ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
Mahesh Bigala | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

