దీపిక ఫిట్నెస్ పాఠాలు

ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే కథానాయికల్లో మంగళూరు సొగసరి దీపికాపడుకోన్ ముందువరుసలో ఉంటుంది. తీరైన శరీరాకృతిని సొంతం చేసుకోవాలంటే వ్యాయామాల్ని జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని ఎప్పుడూ చెబుతుంటుంది. వర్కవుట్ల విషయంలో ఎంతో మంది బాలీవుడ్ నాయికలకు ఆదర్శంగా ఉండే ఈ అమ్మడు తెరపై వ్యాయామ శిక్షకురాలి పాత్రలో కనిపించబోతున్నది. వివరాల్లోకి వెళితే..శకున్బాత్రా దర్శకత్వంలో దీపికాపడుకోన్ ఓ చిత్రంలో నటిస్తోంది. సిద్ధాంత్ చతుర్వేది, అనన్యాపాండే ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికాపడుకోన్, అనన్యాపాండే అక్కాచెల్లెళ్లుగా కనిపించబోతున్నారు. ఇందులో దీపికా ఫిట్నెస్ ట్రెయినర్ పాత్రలో నటిస్తుందని సమాచారం. స్వతహాగా యోగా, ఏరోబిక్స్ వంటి విద్యల్లో నిష్ణాతురాలైన దీపికాపడుకోన్ సినిమాలోని పాత్రకు చక్కగా కుదిరిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దీపికాపడుకోన్ పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. రణ్‌వీర్‌సింగ్ సరసన ‘83’, షారుఖ్‌ఖాన్‌తో కలిసి ‘పఠాన్’, హృతిక్‌రోషన్‌కు జోడీగా ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో నాయికగా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

