బాలీవుడ్ (Bollywood)యాక్టర్లు దీపికా పదుకొనే (Deepika Padukone), సిద్దాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi )కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గెహ్రియాన్ (Gehraiyaan ). శకున్ బత్రా డైరెక్షన్ లో ట్రయాంగ్యులర్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీపికా, సిద్దాంత్ రొమాంటిక్ ట్రాక్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అయితే తాజాగా దీపికా, సిద్దాంత్ సినిమాను మరింత ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని స్టిల్స్ ను షేర్ చేశారు. ఈ ఫొటోలు నీటిలోపల (అండర్ వాటర్) తీసినవి కావడం.
అండర్ వాటర్‌లో ఆరేంజ్ స్విమ్ షూట్ వేసుకున్న దీపికా పదుకొనే కళ్లు చాలా స్పష్టంగా ఓపెన్ చేసి కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. బయట షూటింగ్‌లోనే కాదు నీటిలో కూడా దీపికా ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి ఔరా అనిపిస్తోంది. కొన్ని సార్లు సురక్షితమైన ప్రదేశం నీటిలో..#GehraiyaanOnPrime హ్యాష్ ట్యాగ్‌తో ఇప్పుడే చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
మరోవైపు సిద్దాంత్ కూడా ప్రింటెడ్ షర్ట్, వైట్ ప్యాంట్లో కెమెరాకు ఫోజులిచ్చాడు. రాబోయే ఈ దృశ్యాన్ని ఎవరూ చూసిండరిన నేను బెట్టింగ్ చేస్తున్నా. ఫీవర్ కొనసాగుతుంది అంటూ సిద్దాంత్ క్యాప్షన్ ఇచ్చాడు. మొత్తానికి దీపికా, సిద్దాంత్ చాలా కొత్తగా చేస్తున్న ప్రమోషన్ సినిమాకు బాగానే ఉపయోగపడుతుందనడంతో ఎలాంటి సందేహం లేదు.