దీపికా తెలుగు డబ్బింగ్?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఇటలీలో ఓ పాట చిత్రీకరణ జరుగుతున్నది.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఇటలీలో ఓ పాట చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో దీపికా పడుకోన్ పద్మ అనే పాత్రలో నటిస్తున్నదని, కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికే దీపికా పడుకోన్ పాత్ర తాలూకు షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పే ప్రయత్నాల్లో ఉందట దీపికా పడుకోన్. దక్షిణాది అమ్మాయి కావడంతో తెలుగును అర్థం చేసుకొని డబ్బింగ్ చెప్పడం అంత కష్టమైన విషమేమి కాదని, ఓన్ డబ్బింగ్ వల్ల పాత్రలోని ఉద్వేగాలు మరింత బలంగా కనిపిస్తాయనే ఆలోచనలో ఉందట దీపికా పడుకోన్.
అందుకోసం ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు భాషపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉందట. అయితే వాయిస్ టెస్ట్ అనంతరం డబ్బింగ్ విషయంలో చిత్ర బృందం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ‘కల్కీ 2898’ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

