ఆ రోజుల్ని మరచిపోను!
మానసిక రుగ్మతల్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా బయటపడతామని సూచించింది అగ్ర కథానాయిక దీపికా పడుకోన్. ఏడేళ్ల క్రితం తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యానని, ఓ దశలో ఆత్మహత్య తాలూకు ఆలోచనలతో సతమతమయ్యానని చెప్పింది. మానసిక వ్యాధిగ్రస్తులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ఆమె ‘లివ్ లవ్ లాఫ్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఇటీవల మంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాను డిప్రెషన్‌తో బాధపడిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంది దీపికా పడుకోన్. కుటుంబ సభ్యుల మద్దతు, సైకియాట్రిక్ కౌన్సిలింగ్ వల్ల తాను కుంగుబాటు నుంచి కోలుకున్నానని చెప్పింది
మానసిక రుగ్మతల్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా బయటపడతామని సూచించింది అగ్ర కథానాయిక దీపికా పడుకోన్. ఏడేళ్ల క్రితం తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యానని, ఓ దశలో ఆత్మహత్య తాలూకు ఆలోచనలతో సతమతమయ్యానని చెప్పింది. మానసిక వ్యాధిగ్రస్తులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఇటీవల మంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాను డిప్రెషన్‌తో బాధపడిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంది దీపికా పడుకోన్. కుటుంబ సభ్యుల మద్దతు, సైకియాట్రిక్ కౌన్సిలింగ్ వల్ల తాను కుంగుబాటు నుంచి కోలుకున్నానని చెప్పింది.
‘ఆ రోజుల్ని నా జీవితంలో మరచిపోలేను. కెరీర్ అగ్రస్థానంలో ఉన్నప్పుడే డిప్రెషన్‌కు గురయ్యాను. ఉదయం లేవగానే ప్రపంచమంతా శూన్యంగా అనిపించేది. జీవితానికి అర్థం లేదనే ఆలోచనలు వెంటాడేవి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ ఉండేదాన్ని. ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చేది. అలా ఒంటరిగా ఏడ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. నాలోని మానసిక మార్పులను మా కుటుంబ సభ్యులు గుర్తించడంతో వైద్య సహాయం తీసుకొని బయటపడ్డాను. ప్రతి ఒక్కరు మానసిక వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని దీపికా పడుకోన్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

